ఇప్పటిదాకా ఓ లెక్క ఇకపై ఓ లెక్క అన్న విధంగా ఉన్న రాజకీయాల్లో మరో మార్పు రానుంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ త్వరలోనే పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి కొంత కార్య నిర్వహణ కూడా చేశారని తెలుస్తోంది. దీంతో బాబు కూటమిలో మరో పార్టీ వచ్చి చేరే అవకాశాలున్నాయి అని కూడా తెలుస్తోంది. గతంలో జగన్ అక్రమాస్తుల కేసులను శరవేగంతో అప్పట్లో ఆరోపణలు వచ్చిన విధంగా సోనియా డైరెక్షన్లో దర్యాప్తు పూర్తి చేసిన జేడీ ఇప్పుడు దిశను మార్చారు. అసని తుఫాను అంత వేగంతో దిశను మార్చారు. అందుకే ఆయన తుఫాను వేగంతో వస్తున్నారు అని కూడా తెలుస్తోంది. బాగుంది బాబు గూటిలో మరో పార్టీ అన్నది ఓ ఊహాగానం ఏమో గుర్రం ఎగురావచ్చు.. కాకి కోయిల కానూవచ్చు.
రాజకీయాల్లో ఏది ఎప్పుడయినా కావొచ్చు. అందుకు పెద్ద, పెద్ద పరిణామాలే కావక్కర్లేదు.. చిన్న చిన్న కారణాలు కూడా సరిపోతాయి. ఆ విధంగా పొలిటికల్ తుఫాను తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు అన్నది క్లారిఫికేషన్ కాలేదు. కానీ పొత్తు ఉంటే మేలు అని టీడీపీ భావించినా, పవన్ అభిమానులు మాత్రం అధినేత నిర్ణయాన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. దీంతో పొత్తు ఉన్నా లేకున్నా గతంలో మాదిరిగానే అంటే 2019 ఎన్నికల మాదిరిగానే ఒంటరిగా వెళ్లేంత సాహసం చేయలేకపోతున్నారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో కూడా ఓ విధంగా ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ ప్రచారం కూడా కొంత టీడీపీకి అనుకూలంగానే సాగింది అన్న ఆరోపణలు కూడా వచ్చేయి. ప్రజాశాంతి పార్టీ కానీ కొత్త పల్లి గీత ప్రారంభించిన పార్టీ కానీ అవన్నీ ఆ రోజు జగన్ ను నిలువరించేందుకే ఉపయోగపడ్డాయన్న వార్తలు అప్పట్లో వచ్చేయి. కానీ అవేవీ ఆ పని చేయలేక చతికిలపడ్డాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొత్త తరహా రాజకీయాలకు ఇష్టపడుతోంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా జగన్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపించే ఛాన్స్ ఉంటే, ఇక వచ్చే ఎన్నికల్లో జేడీ, జనసేన, ఆప్ తో సహా టీడీపీ, కమ్యూనిస్టులు,బీజేపీ, కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలను ఒంటి చేత్తో ఎదుర్కోగలగడం అన్నది జగన్ ముందు ఉన్న ఓ సవాలు. దీనిని ఆయన ఏ విఇధంగా అధిగమిస్తారో అన్నది చూడాలిక.