మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తల్లిని వైఎస్ వివేకానంద లైంగికంగా వేధించడం వల్లే హత్య చేశారని వైఎస్ భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది సరికొత్త చేపట్టారు. వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేపట్టారు. ఈ పిటిషన్‌పై నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.
తల్లిని లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశారని భాస్కర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదన చేశారు. ఈ రెండు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేయడం జరిగింది. అయితే, వైఎస్ వివేకా హత్యకేసు మొదటి నుండి మలుపుల పై మలుపులు తిరుగుతున్నాయి. తొలుత వైఎస్ వివేకా గుండెపోటుతో మరణించారని ఆరోపించారు. అనంతరం గొడ్డలితో హత్య చేశారని మరో ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఓ సెటిల్‌మెంట్ విషయంలో హత్య జరిగిందని కొందరు అన్నారు. వైఎస్ వివేకాకు రెండో భార్య ఉందని, పేరుకూడా మార్చుకున్నారని, అందువల్లే హత్య జరిగి ఉండొచ్చని కూడా ఆరోపించారు. కానీ ఎంపీ టికెట్ విషయంలో తన తండ్రిని హత్య చేశారని వైఎస్ సునీతారెడ్డి భావిస్తున్నారు.