రేవ్ పార్టీపై మీ స్పందన ఏంటీ కేటీఆర్ : సామ రామ్మోహన్ రెడ్డి

-

రేవ్ పార్టీపై మీ స్పందన ఏమిటి కేటీఆర్? అని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. జన్వాడ ఫామ్‌హౌజ్‌లో రేవ్ పార్టీ అని వస్తున్న వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో జరిగిన స్పెషల్ పార్టీపై ఎస్ఓటీ పోలీసుల దాడులను ప్రస్తావించారు.జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్‌పాకాల ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరిగిందని, పార్టీలో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారని చెప్పారు.

ఒకరికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని, కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్ టెస్ట్‌లో తేలడంతో ఎన్డీపీఎస్ చట్టం మేరకు కేసు నమోదైందని గుర్తుచేశారు. భారీ శబ్దాలతో పార్టీ నడుస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్స్ చేశారన్నారు. మరోవైపు భారీగా లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారన్నారు. దీనిపై సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదైందని వివరించారు. దీనంతటి మీద కేటీఆర్ మీ స్పందన? అంటూ ఆయన ఎక్స్ ఖాతాకు ట్యాగ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version