అన్నదాతలకి జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!

-

అన్నదాతలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ ని చెప్పింది. ఈ నెల 29న రైతుల బ్యాంకు ఖాతా లోకి వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు జమ చేస్తున్నట్టు చెప్పింది. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ఈ నెల 29న రైతుల బ్యాంకు అకౌంట్లలో డైరెక్ట్ గా డబ్బులు పడతాయట.

రబీ 2020-21, ఖరీఫ్ 2021 సీజన్లకు సంబంధించి లక్ష లోపు బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ తీసుకుని చెల్లించని వాళ్ళకి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ డబ్బులను ఇస్తోంది సర్కార్. అయితే రబీ 2020-21 సీజన్‌కు 2,54,568 మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది.

వాళ్ళకి ఈ నెల 29న జమ చేస్తోందట. లబ్ధిదారుల జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో ఉంటాయట. వాటిని రైతులు చెక్ చేసుకోవచ్చు. లేదంటే https://karshak.ap.gov.in/ysrsvpr/ వెబ్ సైట్‌లో కూడా చెక్ చెయ్యచ్చు. ఈ నెల 22 వరకు తప్పులను చూసుకుని మార్చుకునే అవకాశం ని అధికారులు కల్పించారు. ఆ తరవాత ఈ నెల 29నే ఆయా రైతులకి డబ్బులు జమ చేయనున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పేరుతో వైసీపీ అధికారంలోకి వచ్చిన దీన్ని ప్రారంభించారు. బ్యాంక్స్ నుండి లక్ష క్రాప్ లోన్ తీసుకుని గడువులోగా బ్యాంకులకు తిరిగి చెల్లించిన వారికి వడ్డీ ని ప్రభుత్వం ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version