మీరు వాడే ఆవాలు విషపూరితమైన ఈ విత్తనాలతో కల్తీ అయ్యాయా? ఇలా టెస్ట్ చేయండి

-

తాలింపుల్లో తరుచుగా వాడే చిన్నసైజు ఉంటాయి కానీ..కొండత మేలు చేస్తాయి. వంటల్లో కచ్చితంగా ఆవాలు పడాల్సిందే..కానీ ఈ రోజుల్లో ఈ విత్తనాలు కూడా విషపూరితమైన అర్జిమోన్ విత్తనాలతో కల్తీ అవుతున్నాయని మీకు తెలుసా? ఈ విష విత్తనాలను ఎలా గుర్తించాలనేది ఆందోళన కలిగించే ప్రశ్నే. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ట్విట్టర్‌ ద్వారా చేపట్టిన #DetectingFoodAdulterants కార్యక్రమంలో ఇంట్లో ఆహార కల్తీలను ఎలా గుర్తించాలో సాధారణ ప్రజలకు మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వారం ఆవాలలో అర్జెమోన్ విత్తనాల కల్తీని ఎలా గుర్తించాలో ఒక పరీక్ష వీడియోను పంచుకున్నారు. అర్జెమోన్ గింజలను కల్తీ చేయడానికి తరచుగా ఆవాల నూనెతో కలుపుతారు. ఈ విత్తనాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటిని ఎలా గుర్తించాలో మనం చూసేద్దాం..

అర్జిమోన్ సీడ్స్ వల్ల కలిగే దుష్ర్పభావాలు..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. అర్జెమోన్ గింజలు లేదా నూనెను తీసుకోవడం వల్ల కేశనాళికల పారగమ్యత పెరుగుతుంది. ఇది ఎడెమాకు దారితీస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి ,ఎర్ర రక్త కణాల మరణంతో రక్తహీనత ,చివరికి రక్తప్రసరణ జరగక గుండె ఆగిపోతుంది. అర్జెమోన్ విత్తనాలలో 30-35% నూనె ఉంటుంది. అందులో 0.13% ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఆర్జెమోన్ మెక్సికానా మొక్క సీడ్ ఆయిల్‌లో టాక్సిక్ క్వాటర్నరీ బెంజోఫెనాంత్రిడిన్ ఆల్కలాయిడ్స్ సాంగునారిన్ ,డీహైడ్రోసాంగ్వినారైన్ తక్కువ పరిమాణంలో చెలెట్రిథ్రిన్, కాప్టిసిన్ ఉంటుంది. తక్కువ మొత్తంలో బెర్బెరిన్, ప్రోటోపిన్, ఐసోక్వినోల్ నుండి డ్రాప్‌డిమిక్ ఆయిల్ ఉంటుంది.

ఆవాలు కల్తీని ఎలా గుర్తించాలి?

1.గాజు ప్లేట్‌లో కొద్ది మొత్తంలో ఆవాలు తీసుకోండి.

2. కొన్ని ధాన్యపు గరుకైన ఉపరితల గింజలు నలుపు రంగులో ఉన్నాయా అని బాగా చూడండి.

3. కల్తీ లేని ఆవాలు బయటకు మృదువుగా కనిపిస్తాయి.

4. అయితే, అర్జెమోన్ గింజలు కలిగి ఉన్న కల్తీ ఆవాల ఉపరితలం గరుకుగా ,నలుపు రంగులో ఉంటాయి.

ఈ విధంగా ఆవాల్లో విషపూరితమైన గింజలు కలిశాయా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో కల్తీలేని ఆహారం అంటూ ఏదీ లేకుండా పోతుంది. కాబట్టి వాడేముందు ఇలాంటి తనీఖీలు చేయడం ద్వారా పదిలో ఒక్కటైనా మీరు గుర్తించి దరిచేరనీయకుండా ఉంచుకోవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version