వ్యూహం సినిమాపై హైకోర్టు లో ముగిసిన వాదనలు….

-

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తనను కించపరిచేలా ఈ సినిమాను రూపొందించారని నారా లోకేశ్ కోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉండగా కోర్టులో విచారణ కారణంగా వాయిదా పడింది.

రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాల్లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటిస్తుండగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తుంది.సినిమాలో వైఎస్సార్ మరణం ఆ తర్వాత జరిగే ఓదార్పు యాత్ర.. జగన్ జైలు ప్రయాణం.. బెయిల్ పై వచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం.. మొదలగు అంశాలపై ఈ సినిమా రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version