హైదరాబాద్లోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. సంతోష్ నగర్లో మోహీద్ అనే యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం మాటు వేసి కత్తులతో కిరాతకంగా పొడిచి చంపినట్లు సమాచారం. స్థానికులు కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మర్డర్ గురించి చుట్టుపక్కల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, మోహీద్ హత్యకు పాతకక్షలే కారణంగా తెలుస్తోంది. అందుకోసం అతని స్నేహితులను విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. హత్య జరిగిన ప్రాంతంలో సెక్యూరిటీని పెంచారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.