బ్రకీద్‌ సందర్భంగా వేలం.. కోటి రూపాయిలు పలికిన గొర్రె

-

బక్రీద్‌ అంటే ముస్లీంలకు అతి పెద్ద పండగ. ఖుర్బానీని దానం చేయడం ఈ పండగ ఆనవాయితీ. బక్రీద్ సందర్భంగా గొర్రెలను వేలం వేస్తున్నారు. అందులో ఒకటి సుల్తాన్ అనే గొర్రె. దీని ధర కోటి రూపాయలు మించిపోయింది. ఓడియమ్మ ఒక గొర్రె ధర కోటి రూపాయలేంట్రా అనుకుంటున్నారా..? దీని ప్రత్యేకత ఏంటో తెలుసా.?

బక్రీద్‌కు ఎన్నో ప్రత్యేకమైన మేకలు కూడా మార్కెట్‌లోకి వస్తాయి. అలాంటి ఒక ప్రత్యేకమైన మేకను ఏకంగా హైదరాబాద్ నుంచి నేరుగా ముంబైకి తీసుకురానున్నారు. హైదరాబాద్ నుంచి ముంబైకి తెప్పించుకున్నారంటే దాంట్లో స్పెషాలిటీ ఏమిటంటే దాని ఖరీదు. అవును ఒక మేక ఖరీదు బీఎండబ్లూ కారుతో సమానం మీకు తెలుసా. అక్షరాల కోటి రూపాయల కంటే ఎక్కువ.

బక్రీద్ రోజున కోసి కూరవండుకునే మేక, లేదా గొర్రకు అంత ఖరీదు ఏంట్రా అని మీరు ఆశ్చర్యపోతున్నారమో.. కాని పెట్టవచ్చు అంటున్నారు ముస్లిం సోదరులు. దానికున్న ప్రత్యేకతే వేరు అంటున్నారు. లగ్జరీ కారు వచ్చే ధరకు మేకను కొనుక్కోవడానికి అసలు కారణం ఏమిటంటే. కోటి రూపాయల కంటే ఎక్కువ ధర చెల్లించి సొంతం చేసుకున్న ఈ గొర్రెను కొనుగోలు చేసిన యజమాని ఏం చెబుతున్నాడంటే మేక చర్మంపై ఒకవైపు అల్లా అని మరోవైపు మహమ్మద్ అని రాసి ఉండటమే ప్రత్యేకతగా చెబుతున్నారు. బక్రీద్‌కి స్పెషల్‌గా నిలిచిన ఈ గొర్రె పేరు సుల్తాన్. ఈ మేక మద్రాస్‌లో పెరిగిందట. దీని ద్వారా వచ్చిన డబ్బును ముస్లిం మతంలోని పిల్లలకు ఉచితంగా ఇస్లామిక్ శిక్షణ ఇప్పిస్తానని యాజమాన్యం తెలిపింది.

బక్రీద్ ప్రాముఖ్యత

మతగ్రం థాల ప్రకారం సమాజ హితం కోసం, అల్లా ఆజ్ఞ మేరకు మహ్మద్ ప్రవక్త తన కుమారుల్లో ఒకరిని త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆ త్యాగాన్ని స్మరిస్తూ ఈద్- అల్- అదా జరుపుకుంటారు. అయితే, ముస్లిం ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధమైనప్పుడు, అల్లా జోక్యం చేసుకుంటాడు. అతని కొడుకు స్థానంలో బలి ఇవ్వడానికి ప్రత్యామ్నాయాన్ని మార్గాన్ని అందిస్తాడు. దీంతో అతని కొడుకు ప్రాణాలతో తిరిగి వస్తాడు. అల్లాపై విశ్వాసం, నమ్మకం ఉంచితే అల్లా కాపాడుతాడు అని చెప్పటానికి ఇది ప్రతీక.

Read more RELATED
Recommended to you

Exit mobile version