ఈ రోజుల్లో దీర్ఘకాల రోగాలతో చాలామంది బాధపడుతున్నారు. మధుమేహం, గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్, ఒబిసీటితో వంటి సమస్యల వలయంలో చిక్కుకున్నవారు ఏంతో మంది ఉన్నారు. ఈ జబ్బులు భారిన పడినవారు.. డైలీ టాబ్లెట్ మింగాల్సిందే..అయితే ఈ సమస్యలను అదుపులో ఉంచడానికి బేల్ ఆకులు బాగా ఉపయోగపడతాయి. శివునికి నైవేద్యంగా పెట్టే బేల్ ఆకులు దివ్య ఔషధం. ఈరోజు ఈ ఆకు ప్రయోజనాలు తెలుసుకుందాం..
బేల్ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, పోషక మూలకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులలో విటమిన్ ఎ, విటమిన్ సీ, రిబోఫ్లోబిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి1, బి6, బి12 ఉంటాయి. పచ్చి ఆకులు మలబద్దకాన్ని తొలగించడంలో నెంబర్ వన్ గా పనిచేస్తాయి. లేత ఉప్పు, ఎండుమిర్చితో బేల్ ఆకులను తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులు జీర్ణ శక్తిని బాగా పెంచుతాయి.
బేల్ ఆకులు కడుపుని శుభ్రం చేయడానికి సూపర్‌గా పనిచేస్తాయి. ఇది భేదిమందు లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు ఉంటే బెల్ ఆకులను తీసుకుంటే మంచిది.
వేసవి కాలంలో బేల్ సిరప్ తాగుతారు. కానీ, దాని ఆకులను ఏడాది పొడవునా ఉపయోగించవచ్చు.
గుండెల్లో మంటగా ఉన్నట్లయితే, దాని ఆకులను నీటితో మెత్తగా రుబ్బి, వడపోసి రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. ఇలా చేయడం వల్ల మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల వేడి వల్ల శరీరంలో బొబ్బలు వస్తాయి. ఆ సమయంలో బేల్ లీఫ్ చక్కగా ఉపయోగపడతాయి.
దగ్గు జలుబుతో బాధపడేప్పుడు కూడా..బేల్ ఆకులు ఉపయోగపడతాయి. తేనేతో రంగరించి తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది.
మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి కూా బేల్ ఆకులు ఉపయోగపడతాయి. వీటితో తయారు చేసిన టీ తాగుతారు.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి..మీకు తగ్గట్టుగా బేల్ ఆకులును వాడుకోవచ్చు. అయితే వీటిని వాడేముందు మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా..మీ వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకే ఆకులను వాడగలరు.