ఈ మధ్య రాజకీయాల్లో చాలా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బుల్డోజర్. యూపీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు యోగీ ఆదిత్యనాథ్ ను బుల్డోజర్ బాబాగా అభివర్ణించాయి. ప్రస్తుతం ఈ పేరే ఓ బ్రాండ్ గా మారింది. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించాలంటే బుల్డోజర్లే నయం అని యూపీ సీఎం యోగీ నమ్ముతున్నారు. ప్రస్తుతం ‘ బుల్డోజర్’ బీజేపీ పార్టీకి బ్రాండ్ గా మారింది. ఇటీవల శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్ లలో ఘర్షణలు ఏర్పడ్డాయి. అక్కడి బీజేపీ ప్రభుత్వాలు కూడా యోగీ మార్క్ బుల్డోజర్ ట్రీట్మెంట్ ను అనుసరించాయి. ఘర్షణలకు కారణమైన వారి ఆస్తులను బుల్డోజర్లతో ధ్వంసం చేశాయి.
తాజాగా టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ.. బండి సంజయ్ ఓ ట్వీట్ పెట్టాడు. టీఆర్ఎస్ పార్టీకి చురకలు అంటించాడు. కార్ల కంటే బుల్డోజర్లు నయం అని.. బుల్డోజర్లు నిర్మాణం, కూల్చివేత, రెస్క్యూ ఆపరేషన్లు, మద్యం తాగి డ్రైవర్లు( నాయకుల) కార్లను ధ్వంసం చేయడానికి, వారి ప్రాణాలు తీయడానికి , భవిష్యత్తును నాశనం చేయడానికి కూడా ఉపయోగిస్తారంటూ… టీఆర్ఎస్ పార్టీపై వ్యంగంగా ట్వీట్ పెట్టాడు.