Acharya: పాదఘట్టం టు ప్రకృతివనం..‘ఆచార్య’ కోసం ‘సిద్ధ’ పయనం..

-

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో హీరోలు, డైరెక్టర్ పాల్గొంటున్నారు. సినిమా విజ్యువల్ ఫీస్ట్ గా ఉండబోతున్నదని చెప్తున్నారు. కాగా, రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’కు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. సదరు ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ ఫొటోల్లో రామ్ చరణ్ ‘సిద్ధ’ పాత్రలోకి కంప్లీట్ గా షిఫ్ట్ అయినట్లు కనబడుతున్నారు. పచ్చటి ప్రకృతి వనంలో నక్సలైట్ గా నిలబడి ఉన్న ‘సిద్ధ’..‘ఆచార్య’ విషయమై సుదీర్ఘమైన ఆలోచన చేస్తున్నట్లున్నారు.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు సినిమా డెఫినెట్ గా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది.

‘నీలాంబరి’గా హాఫ్ శారీలో ఇందులో అదరగొట్టిందని టాక్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. డెఫినెట్ గా ఈ మూవీ ..ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు సినీ పరిశీలకులు.

Read more RELATED
Recommended to you

Latest news