గుంటనక్కలన్నీ ఒకటయ్యాయి.. సింహాం సింగిల్‌గా వస్తుంది : బండి సంజయ్‌

-

లాఠీ దెబ్బలకు, నాన్ బెయిలబుల్ కేసులకు, పీడీ యాక్ట్‌లకు ధర్మ రక్షకులు భయపడరని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్, చర్లపల్లి జైల్లో కేసీఆర్‌కు రూమ్ రెడీ చేశామన్నారు. కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కేసులు, అరెస్ట్‌లతో ఇబ్బందులు పెట్టారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎప్పుడు చస్తామో, ఎన్నాళ్లు బతుకుతామో చెప్పలేని పరిస్దితులు వున్నాయన్నారు. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తే లేదని .. రక్తం సలసలా మరుగుతోందని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేనికైనా భరించి కొట్లాడతామని, దేనికైనా తెగించి కొట్లాడతామన్నారు. బీజేపీ ఎప్పుడూ మతతత్వాన్ని రెచ్చగొట్టలేదని బండి సంజయ్ అన్నారు. బీజేపీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. ఇప్పుడు కేసీఆర్ సీఎం అయ్యారని ఆయన గుర్తుచేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

వీఆర్ఏలు ధర్నాలు చేస్తున్నా వారిని పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయని, ఆ ఆరోపణలను పక్కదారి పట్టించడానికే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. ఆ కుంభకోణంలో పాత్ర ఉందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతలను అవమానించిన మునావర్‌కి 2 వేల మందితో భద్రత కల్పిస్తారా? అని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించడానికే మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూశారని విమర్శించారు. బీజేపీని బదనాం చేయడానికి హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని చూశారన్నారు. గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. బీజేపీ సింహంలా సింగిల్‌గా వస్తుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version