మోడీ తెలంగాణ వస్తుండంటే.. కేసీఆర్‌కు జరమస్తది : బండి సంజయ్‌

-

మరోసారి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్‌. నేడు ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. కేసీఆర్ కు వరంగల్ సభకు వచ్చే మొఖం లేదని, అందుకే రాలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మోడీపర్యటన అనగానే కేసీఆర్ కు జ్వరమొస్తుందంటూ ఎద్దేవా చేశారు. తనకు రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చిన బీజేపీకి రుణపడి ఉంటానని అన్నారు. రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి నేతృత్వంలో కేసీఆర్ గడీల బద్దలు కొడతామని, బీఆర్ఎస్ పాలనను అంతమొందిస్తామని చెప్పారు.

రాష్ట్రం నుంచి జనం కల్వకుంట్ల ఫ్యామిలీ బైకాట్ చేస్తరుప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను కేసీఆర్ బహిష్కరించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు.‘కేసీఆర్ గారు మీరు.. ఎందుకు బహిష్కరిస్తున్నారో చెప్పాలి… ఆర్ఎంయూకు వ్యతిరేకగంగా మీరు బైకాట్ చేస్తున్నారా..? జాతీయ రహదారులకు ప్రారంభోత్సవాలను మీరు వ్యతిరేకిస్తున్నారా’తేల్చాలని అని డిమాండ్ చేశారు. వరంగల్ విజయ్ సంకల్ప్ సభ వేదిక నుంచి ఆయన మాట్లాడారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పెట్టినందుకు బైకాట్ చేస్తున్నారా..? వందే భారత్ ట్రైన్లు ప్రారంభించినందుకు బైకాట్ చేస్తున్నారా..? చెప్పాలన్నారు. రాష్ట్రం నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని బైకాట్ చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version