ఈ రోజు తెలంగాణ సి ఎల్ పి నేత భట్టి విక్రమార్క యాదాద్రి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో మూసాయిపేటలో ఐకేపీ కేంద్రం వద్ద వర్షాల కారణంగా తడిసి ముద్దైన ధాన్యాన్ని చూసి రైతులకు ధైర్యాన్ని చెప్పిండు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ లో భట్టి మాట్లాడారు. ఆ తర్వాత రఘనాధపురంలో పవర్ లూమ్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత దుర్గమ్మ గుడిలో పూజలు చేసి బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక BRS ప్రభుత్వం ఆలేరు నీటిని అందించడంలో చేసిన ద్రోహాన్ని అక్కడి ప్రజలకు గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదొర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకాలంటే అది కేవలం ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం అవుతుంది అని భట్టి విక్రమార్క మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఈ సంవత్సరం జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.