BIG UPDATE: “భగవంత్ కేసరి” ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ !

-

నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తొలిసారి నిర్మితమవుతున్న తొలి చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటుగా శ్రీలీల, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ లాంటి నటీనటులు భాగమయ్యారు. ఈ సినిమాలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ కు సంబంధించిన లీక్ ను ఇచ్చారు మూవీ మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 8వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. కాగా ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే ప్రకటించిన విధంగా భగవంత్ కేసరి సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నారు. మరి వరుసగా సక్సెస్ సినిమాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version