కోదండరాంపై కమలం ఫోకస్.. లాగేస్తారా?

-

తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర ఏంటి అనేది ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి తెలుసు. తెలంగాణ సాధన కోసం ఆయన ఆ ఏవిధంగా పోరాడారో కూడా తెలిసిందే. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ పోరాడింది కోదండరాం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ పై నుంచి ఉద్యమం ఎలా చేయాలనే విషయంపై డైరక్షన్‌లు ఇచ్చారు గానీ..కోదండరాం ఫీల్డ్‌లో ఉండి పోరాడారు. అలా రాష్ట్రం కోసం పోరాడిన కోదండరాంని కేసీఆర్ రాజకీయంగా ఎలా సైడ్ చేసేశారో కూడా తెలిసిందే.
అయితే కేసీఆర్‌కు చెక్ పెట్టాలని చెప్పి తెలంగాణ జన సమితి పేరుతో కోదండరాం పార్టీ పెట్టి ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజా కూటమిలో భాగంగా పోటీ చేసి విఫలమయ్యారు. ఇక ఇప్పటికే తెలంగాణలో టీజేఎస్ పార్టీకి పెద్ద ఉనికి లేదని చెప్పొచ్చు. ఆ పార్టీకి బలమైన నిర్మాణం లేదు. కాకపోతే కోదండరాంకు మాత్రం వ్యక్తిగతమైన ఇమేజ్ ఉంది. కానీ పార్టీ పరంగా అది ఉపయోగపడటం లేదు.

kodandaram tjs – Telangana Janasamithi

ఈ క్రమంలోనే ఆయన సపోర్ట్ తీసుకోవడం కోసం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎలాగో కోదండరాం, కేసీఆర్‌కు వ్యతిరేకంగానే రాజకీయం చేస్తున్నారు. దీంతో ఆయన మద్ధతు తీసుకుంటే ఇంకా బెనిఫిట్ అవుతుందని కాంగ్రెస్, బీజేపీలు ఆలోచిస్తున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ కంటే బీజేపీనే దూకుడుగా ఉంది. పైగా ఆ పార్టీనే టీఆర్ఎస్‌కు ధీటుగా ముందుకెళుతుంది. అలాగే ఆ పార్టీలో బలమైన నేత ఈటల రాజేందర్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇక తాజాగా పలువురు తెలంగాణ ఉద్యమ నేతలు కూడా చేరారు. తీన్మార్ మల్లన్న లాంటి వారు కూడా జాయిన్ అయ్యారు.

దీంతో బీజేపీ బలం కాస్త పెరిగినట్లైంది. ఇదే సమయంలో కోదండరాం లాంటి వారు కూడా వస్తే పార్టీకి మరింత బలం పెరుగుతుందని బీజేపీ యోచిస్తుంది. దీంతో ఆయనని పార్టీలోకి తీసుకోచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. మరి చూడాలి కోదండరాం..బీజేపీలోకి వస్తారో లేదో?

Read more RELATED
Recommended to you

Exit mobile version