బీజేపీ వర్సెస్ కాంగ్రెస్: అక్కడ పోటాపోటీ..ఇక్కడ నోటాతో పోటీ…

-

జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార, ప్రతిపక్షాలుగా ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ఈ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. అలాగే పలు రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పార్టీలు ప్రత్యర్ధులుగా ఉన్నాయి. ఇక తెలంగాణలో సైతం రెండు పార్టీలు గట్టిగానే తలపడుతున్నాయి. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్‌ని ఎలాగైనా గద్దె దించి, నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు చూస్తున్నాయి.

బీజేపీ, కాంగ్రెస్

ఓ వైపు టీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తూనే, మరో వైపు ఈ రెండు జాతీయ పార్టీలు పోటాపోటిగా రాజకీయాలు చేస్తున్నాయి. పైగా ఈ రెండు పార్టీల అధ్యక్షులు సైతం ఫైర్‌బ్రాండ్లు మాదిరిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎలాంటి దూకుడు కనబరుస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. అలాగే కాంగ్రెస్‌కు కొత్తగా అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి దూకుడు ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఇలా దూకుడు రాజకీయాలు చేస్తున్న ఈ ఇద్దరు అధ్యక్షులు నెక్స్ట్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పోటీ పడుతున్నారు.

ఇలా తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్‌లు పోటాపోటిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ రెండు పార్టీలు నోటాతో పోటీ పడుతున్నాయి. అసలు ఈ రెండు పార్టీలు ఏపీలో ఉనికి చాటుకోవడానికి తెగ కష్టపడుతున్నాయి. అయినా సరే ఏపీ ప్రజలు ఈ రెండు పార్టీలని ఆదరించడంలేదు. సరే రాష్ర్ట విభజన చేసిందని ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ని పక్కనబెట్టేశారు. దాంతో ఆ పార్టీకి అసలు ఓట్లు పడలేదు. గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు నోటాని దాటలేదు. భవిష్యత్‌లో కూడా దాటే పరిస్తితి కనబడటం లేదు.

ఇక బీజేపీ పరిస్తితి కూడా అలాగే ఉంది. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలని అమలు చేస్తామని బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు సీట్లు గెలుచుకుంది. అటు కేంద్రంలో సైతం బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే ఏపీ ప్రజలని బీజేపీ మోసం చేసింది. హోదా ఇవ్వలేదు. హామీలు నెరవేర్చలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కశాతం ఓట్లు కూడా పడలేదు. కాంగ్రెస్ మాదిరిగానే నోటాని దాటలేదు. భవిష్యత్‌లో కూడా అదే పరిస్తితి కొనసాగేలా ఉంది. కాకపోతే హోదా, ఇతర హామీలని అమలు చేస్తే బీజేపీని ఏపీ ప్రజలు కాస్త నమ్మే పరిస్తితి ఉంది. లేదంటే అంతే సంగతులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version