జగన్ వ్యక్తిగత కేసులను ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నారు : బోండా ఉమ

-

మరోసారి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత బొండా ఉమ. తాజాగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం అయినప్పటి నుంచి వివిధ కేసుల కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేస్తున్నారని బొండా ఉమ విమర్శించారు. తన అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కేసులను వాదిస్తున్న లాయర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుండటం విడ్డూరమని చెప్పారు. జగన్ వ్యక్తిగత కేసులను వాదిస్తున్న సీనియర్ లాయర్లకు ప్రభుత్వ కేసుల రూపంలో కోట్లాది రూపాయలను చెల్లిస్తున్నారని అన్నారు బొండా ఉమ . ప్రభుత్వ కేసులకు కూడా ప్రభుత్వ లాయర్లను నియమించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బొండా ఉమ.

Bonda Uma lashes out at YSRCP ministers on Amaravati

ప్రభుత్వ కేసులకు ప్రైవేట్ లాయర్లను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు సైతం నివ్వెరపోయిందని… న్యాయవాదులపై పెడుతున్న ఖర్చులపై నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించిందని బొండా ఉమ అన్నారు. ప్రైవేట్ న్యాయవాదులకు వందల కోట్లను ఫీజుగా చెల్లించడం దారుణమని చెప్పారు బొండా ఉమ. పోలవరంపై గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఒక ఎన్జీవో ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు వెళ్తే… దానికి కూడా ప్రైవేట్ లాయర్ ను పెట్టుకుంటారా? అని విమర్శించారు బొండా ఉమ.

 

Read more RELATED
Recommended to you

Latest news