టిఆర్ఎస్, బిజెపి ఇద్దరూ దొంగలే – షబ్బీర్ అలీ

-

తెలంగాణలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. టిఆర్ఎస్, బిజెపి రెండు దొంగలేనని తీవ్ర విమర్శలు చేశారు. టిఆర్ఎస్, బిజెపి కలిసే ఈ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీ 33 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని.. 2014లో భైంసా ఎమ్మెల్యేను మొదటిసారి కొనుగోలు చేసిందని విమర్శించారు.

అలాగే తొమ్మిది రాష్ట్రాలలో బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో ముందు 100 కోట్లు అన్నారని, ఆ తర్వాత 15 కోట్లు అన్నారని, ఇప్పుడు ఒక్క పైసా లేదని.. స్వాధీనం చేసుకున్న 15 కోట్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. పట్టుబడిన నలుగురు ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ కు కాకుండా ప్రగతిభవన్ కి ఎలా తీసుకెళ్తారని మండిపడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలకి అమ్ముడుపోవడం కొత్తేమీ కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version