ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆంక్షలు విధించినా.. దాడులపై వెనక్కి తగ్గకపోవడంతో బ్రిటన్ కొత్త డిమాండ్ ను ముందుకు తీసుకువస్తుంది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం నుంచి రష్యాను పూర్తిగా తొలగించాలని బ్రిటన్ డిమాండ్ చేస్తోంది. ఐక్య రాజ్య సమతి భద్రతా మండలి నుంచి రష్యాను శాశ్వతంగా తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
కాగ ప్రస్తుతం ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా.. రష్యాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, అమెరికా ఉన్నాయి. కాగ ఇది తాము రష్యాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో ఇది కూడా ఒక భాగమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. అలాగే నాటో దేశాల తో పాటు జర్మనీ వంటి దేశాలు కూడా రష్యా పై కఠిన ఆంక్షలు విధించడానికి సిద్ధం అవుతున్నాయి.