బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా మహబూబ్ నగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. పదేళ్లలో తెలంగాణను లూటీ చేశారు. గద్వాలకు నీళ్లు తెస్తానని కేసీఆర్ ఏం చేశారు.. కేసీఆర్ చేపల పులుసు తిని నీటిని దారా దత్తం చేశారని పేర్కొన్నారు. కుర్చీ వేసుకొని ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నావు.. మందు వేసుకొని ఫామ్ హౌస్ వద్ద ఉన్నావు. బీఆర్ఎస్ పాలమూరు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చిందా అని ప్రశ్నింారు. అసూయతో నాపై విషం కక్కుతున్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే.. అల్లుడు హరీశ్ రావు ఒంట్లో బాలేదన్నాడు. ఒంట్లో బాలేదన్నాయన.. నల్లగొండ ఎందుకు పోయిండు అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మేము అడిగిన నిధులు ఇవ్వకపోతే ఇతికి ఆరేస్తామన్నారు. పాలమూరు బిడ్డ రాష్ట్రాన్ని పాలించకూడదా..? అని ప్రశ్నించారు.