కరీంనగర్‌లో కారు-కమలం మధ్యే పోరు..లీడ్ ఎవరికి?

-

తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉన్న ప్రాంతాల్లో కరీంనగర్ పార్లమెంట్ కూడా ఒకటి అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు. ఉమ్మడి ఏపీలోనే కరీంనగర్ లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటింది. 2004లో కే‌సి‌ఆర్..కరీంనగర్ ఎంపీగానే పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఉపఎన్నికల్లో కూడా సత్తా చాటారు. 2009 ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్‌ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

2014లో మళ్ళీ బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది..కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ వేవ్ లో అనూహ్యంగా ఇక్కడ నుంచి బి‌జే‌పి తరుపున బండి సంజయ్ పోటీ చేసి గెలిచారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పరిధిలో ఉన్న అన్నీ అసెంబ్లీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. హుస్నాబాద్, హుజూరాబాద్, సిరిసిల్ల, మానుకొండూరు, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బి‌జే‌పి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది.

అయితే ఈ సారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిలు కరీంనగర్ లో సత్తా చాటాలని చూస్తున్నాయి.  కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే కనిపిస్తుంది. కరీంనగర్ అసెంబ్లీలో ఈ సారి బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య తీవ్రమైన పోరు జరిగే ఛాన్స్ ఉంది. అటు వేములవాడలో అదే పరిస్తితి. ఇక బి‌ఆర్‌ఎస్ నుంచి బి‌జే‌పిలో చేరి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈతలర్ రాజేందర్ మళ్ళీ గెలిచిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే పోరు ఉండనుంది.

అయితే కమ్యూనిస్టులతో బి‌ఆర్‌ఎస్ పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుస్నాబాద్ సి‌పి‌ఐకి ఇచ్చే ఛాన్స్ ఉంది. అటు చొప్పదండిలో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే పోరు ఉండనుంది. మానకొండూరులో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరిగే ఛాన్స్ ఉంది. సిరిసిల్లలో కే‌టి‌ఆర్‌ ఉన్నారు కాబట్టి..అక్కడ వన్ సైడ్ వార్ ఉండవచ్చు. మొత్తానికి కరీంనగర్ పార్లమెంట్‌లో బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్యే అసలు పోరు ఉంటుంది. మరి ఈ పోరులో ఆధిక్యం ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news