బుద్ధ పూర్ణిమ 2021: తేదీ.. విశేషాలు.. ప్రాముఖ్యత..కొటేషన్లు

-

గౌతమ బుద్ధుడి జయంతిని బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటారు. గౌతమ బుద్ధుడు స్థాపించిన బౌద్ధమతం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనుసరిస్తున్నారు. ఈ బుద్ధ పూర్ణిమ రోజునే గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్పుకుంటారు. ప్రతీ ఏడాది వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ ఏడాది మే 26వ తేదీన బుద్ధ పూర్ణిమ వస్తుంది. భారతదేశంలో ఈ రోజున హాలీడేగా ప్రకటించారు.

బౌద్ధమతాన్ని అనుసరించే వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించి, మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఈ రోజున ప్రత్యేకమైన ఖీర్ పానీయాన్ని సేవిస్తారు. ఇంకా బోధి వృక్షానికి నీళ్ళు పోసి ధ్యానం చేస్తారు. చాలామంది భక్తులు బీహార్ లో ఉన్న బోధ్ గయాలోని మహాబోధి గుడిని సందర్శిస్తారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించింది. ఈ ప్రదేశంలోనే గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. ఈ రోజుని కల్మషం లేని ఆలోచనలని పెంచుకోవడానికి బుద్ధుడు చూపించిన శాంతి, అహింసను అంతటా వ్యాప్తి చేయడానికి జరుపుకుంటారు.

ఈ బుద్ధ పూర్ణిమ రోజున బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.

ప్రతీరోజూ ఉదయం మనం మళ్ళీ పుడుతుంటాం. ఈ రోజు మనం ఏం చేసామనేదే చాలా ముఖ్యమైన విషయం.

అవతలి వారికోసం దీపం వెలిగిస్తే అది నీకు కూడా దారి చూపుతుంది.

నీ కోపం వల్ల అవతలి వారికి ఏమీ కాదు. నీ కోపం వల్ల నీకే శిక్ష పడుతుంది.

రక్షణ లేని ఆలోచనల కన్నా నీ శత్రువు ఎక్కువ హాని కలిగించలేడు.

గతం ఎలాంటిదైనా సరే, నువ్వు మొదలు పెట్టవచ్చు.

వెయ్యి యుద్ధాలు గెలవడం కన్నా నిన్ను నువ్వు గెలవడం గొప్ప. అప్పుడు విజయం నీదే. దాన్నెవ్వరూ తీసుకెళ్ళలేరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version