కెసిఆర్ కు సవాల్ విసిరిన బండి సంజయ్..నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

-

సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్న సంజయ్, యాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలనును తెలుసుకోవడంతో పాటుగా, టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.తాజాగా దేవరకద్రలో బిజెపి ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.

సీఎం కేసీఆర్ పాలమూరు నుండి వలసలు లేవని చెబుతున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.పాలమూరు జిల్లా నుండి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ సవాల్ విసిరారు.కెసిఆర్ కు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని బండి సంజయ్ పేర్కొన్నారు.తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version