రుణమాఫీ అమలు కాని రైతులందరూ కలిసి తమకు ఎలాంటి షరతులు లేకుండా లోన్ మాఫీ చేయాలనే డిమాండ్‌తో గురువారం ‘చలో ప్రజాభవన్’కు పిలునిచ్చారు.అన్ని జిల్లాల్లోని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట తమకు రుణమాఫీ చేయాలని రైతులు నిరసనలకు దిగుతున్నారు.చలో ప్రజాభవన్‌కు తరలిరావాలంటూ సోషల్ మీడియా వేదికగా ఓ యువ రైతు ఇచ్చిన పిలుపు వైరల్‌గా మారింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు శాంతిభద్రతలు దెబ్బతినకుండా ఆయా జిల్లాల్లో ముందస్తు అరెస్టులు చేశారు.
ఈ క్రమంలోనే కేటీఆర్ ప్రభుత్వం తీరుపై ‘X’వేదికగా ట్వీట్ చేశారు.‘రుణమాఫీ చేయాలని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట వ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బుధవారం రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య.వారు ఏమైనా దొంగలా, ఉగ్రవాదులా.గురువారం ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి.అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.