త‌ల‌సాని కుమారిడిపై కేసు న‌మోదు…!

-

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ పై సైబరాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. శుక్రవారం రాత్రి ఖైర‌తాబాద్ లో జరిగిన సదర్ ఉత్సవాలకు సాయికిరణ్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి కిర‌ణ్ యాద‌ర్ కారులో వెళ్తుండగా రైల్వే గేట్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వ్య‌క్తి పాదంపైకి కారు టైరు ఎక్కింది. అదే దారిలో నడుచుకుంటూ వెళుతున్న ఇందిరా నగర్ కు చెందిన సంతోష్ ఎడమ పాదం పై నుండి కార్ వెళ్ళింది.

case files on sai kiran yadav

బాధితుల కుటుంబ సభ్యులు మరియు స్థానికులు సాయి యాదవ్ ను అడ్డుకుని… వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని… గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పారు. బాధితున్ని పోలీసు వాహనంలో సమీపంలో… ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు కారు నడుపుతున్న సాయి కిర‌ణ్ యాద‌వ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే సాయి కిర‌ణ్ యాద‌వ్ కూడా టీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version