BREAKING : జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం బ్రేక్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. కేంద్ర జనగణన శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. జనగణన సందర్భంగా జూన్ మాసం వరకు జిల్లాల సరిహద్దులో మార్చవద్దని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లకు ఈ మేరకు జన గణన డిప్యూటీ డైరెక్టర్ లేఖ రాశారు.

కరోనా మహమ్మారి, కరోనా వ్యాక్సిన్ వర్షం కారణంగా జనగణనలో జాప్యం జరుగుతోందని… డిప్యూటీ డైరెక్టర్ లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా స్పష్టం చేశారు. అంతవరకు జిల్లాల సరిహద్దులు మార్చవద్దని కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల కింద 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. 26 జిల్లాల నోటిఫికేషన్ విడుదల కాగానే అటు ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అభిప్రాయాలు తీసుకోకుండానే జిల్లాలను వేరుచేసి.. పేర్లు పెట్టారని మండిపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news