Acharya: ‘సిద్ధ’ పాత్రనే హైలైట్..మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన ఫిల్మ్ ‘ఆచార్య’. ఈ పిక్చర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈవెంట్ లో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘ఆచార్య’ చిత్రంలోని పాత్రల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తనకు అవకాశం ఉంటే తాను ‘ఆచార్య’ పాత్ర కాకుండా రామ్ చరణ్ పోషించిన ‘సిద్ధ’ పాత్ర పోషిస్తానని చెప్పారు మెగాస్టార్. ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి మాట్లాడుతూ రామ్ చరణ్ పాత్రలో వేరియేషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలా తనయుడి పాత్రపైన తండ్రి మాట్లాడటం చూసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు.

RRR చిత్రంలోనూ రామ్ చరణ్ పాత్రలో  వేరియేషన్స్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పాత్రలో ‘ఆచార్య’ పిక్చర్ లోనూ వేరియేషన్స్ ఉంటాయన్న సంగతి చిరంజీవి నోట రావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ నటించేందుకు డేట్స్ ఇచ్చినందుకు చిరంజీవి రాజమౌళికి థాంక్స్ చెప్పారు. RRR వంటి భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్న టైంలో రామ్ చరణ్ డేట్స్ ను కొంత కాలం పాటు ‘ఆచార్య’ సినిమాకు ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. ఈ నెల 29న ‘ఆచార్య’ చిత్రం విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version