నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దు.. దర్శకులకు చిరు సూచన

-

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, అందాల భామ శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలెట్‌గా మారింది. ఈ చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో మెగా మాస్ బ్లాక్ బస్టర్ అనే టైటిల్‌తో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. టాలీవుడ్ దర్శకులకు కీలక సూచనలు చేశారు. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని..పేపర్ వర్క్ లోనే అన్ని పూర్తి చేయాలని ఆయన దర్శకుల సూచించారు. వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ సక్సెస్ మీట్ లో చిరు మాట్లాడారు. ఈ సందర్భంగా దర్శకులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హిట్ సినిమా తీశాం,మంచి కథ చెప్పాం, హిట్ కొట్టామంటే కుదరదని..సినీ పరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలని చిరు పేర్కొన్నారు.

నిర్మాతలు బాగుండాలి, వాళ్లు బాగుంటేనే నటీనటులు బతుకుతారని చెప్పారు. సినిమాను ఆదరించినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పక్కర్లేదని..మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే మనకు థాంక్స్ చెబుతున్నారని చిరు తెలిపారు. ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయంపై స్పందించడానికి తనకు మాటలు కూడా రాలేదని చెప్పారు. మనం మాట్లాడటం ఆపేపి, ప్రేక్షకులు చెప్పేదే విందామని అన్నారు. ప్రేక్షకుల ఉత్సహమే మనల్ని నడిపించే ఇంధనమని చెప్పారు. ఈ సినిమా కోసం తాను బాధ్యతతో పని చేశానని అన్నారు. కష్టం తనది, రవితేజది కాదని… సినిమా బాగా రావాలని పని చేసిన వారిదని చెప్పారు. ఈ విజయం సినీ కార్మికులదని అన్నారు. ఈ సినిమా విజయం ఔత్సాహిక దర్శకులకు ఒక కేస్ స్టడీలా ఉపయోగపడుతుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version