ఏపీలో సీజేఐ NV రమణ మూడు రోజుల పర్యటన

ఏపీలో సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ 3 రోజుల పర్యటించనున్నారు. ఈ నెల 24 వ తేదీ నుంచి 26 వ తేదీ వరకు ఏపీలో ఉండనున్నారు సీజే ఎన్వీ రమణ. 24 వ తేదీన ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు (మం) పొన్నవరం రానున్నారు సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ. ఇక 26 వ తేదీన ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల రెండో సదస్సుకు హాజరవనున్నారు సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ. ఇక 26 వ తేదీన ఏపీ హైకోర్టును సందర్శించనున్నారు సీజే రమన.

కాగా ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం వరంగల్ లో ఉన్నారు ఎన్వీ రమణ. నిన్న వరంగల్ పట్టణానికి వచ్చిన ఎన్వి రమణ దంపతులకు తెలంగాణ ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఇక ఇవాళ ఉదయం వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఎన్.వి.రమణ దంపతులు. అనంతరం జిల్లా కోర్టులో నిర్మించిన నూతన కోర్టు భవనాలను ప్రారంభించనున్నారు.