పవన్ సీటుపై క్లారిటీ…ఒకచోటే!

-

రాజకీయాలో ఏ పార్టీ అధినేత అయిన సత్తా చాటితేనే..ఆ పార్టీ కూడా సత్తా చాటుతుంది…అసలు అధ్యక్షుడే చతికలపడితే…పార్టీ పరిస్తితి కూడా ఘోరంగా ఉంటుంది…గత ఎన్నికల్లో ఏపీలో జనసేన విషయంలో అదే జరిగిందని చెప్పొచ్చు. జనసేన అధినేత పవన్ కల్యాణ్…రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు..భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు…పవన్ ఓడిపోవడం కాదు..జనసేన కూడా ఘోరంగా ఓడింది..కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.
pawan-kalyan
pawan-kalyan
అయితే అది గత ఎన్నికల పరిస్తితి..కానీ ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది…ఇక జనసేన సత్తా చాటడం కంటే ముందు పవన్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది..పవన్ ఈ సారి ఖచ్చితంగా గెలవాల్సి ఉంది..లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్ డేంజర్‌లో ఉంటుంది…గత ఎన్నికలంటే జగన్ గాలి ఉంది…కానీ ఈ సారి అలా ఉండదు. పైగా కొన్ని స్థానాల్లో జనసేన…టీడీపీ, వైసీపీలకు ధీటుగా పుంజుకుంటుంది.
అదే సమయంలో టీడీపీతో గాని జనసేన కలిస్తే పవన్ గెలుపే కాదు…ఇంకా జనసేన కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సారి పవన్ మాత్రం ఆచి తూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది…టీడీపీతో పొత్తు పెట్టుకుంటే గెలుపు విషయంలో ఢోకా ఉండదు…ఒకవేళ పొత్తు లేకపోయిన సొంతంగా ఎలా గెలవాలనేది పవన్ చూసుకోవాలి…ముఖ్యంగా తాను గెలిచే సీటు చూసుకోవాలి. అయితే ఈ సారి పవన్ గాజువాక, భీమవరంల్లోనే పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటికే తిరుపతిలో పోటీ చేస్తారని ప్రచారం వచ్చింది…ఇటీవల కాకినాడ సిటీ గాని, రూరల్ స్థానంలో గాని పోటీ చేస్తారని కథనాలు వచ్చాయి.
కథనాలు అయితే వస్తున్నాయి గాని పవన్ సీటు మాత్రం ఫిక్స్ కావడం లేదు..అయితే త్వరగా సీటు ఫిక్స్ చేసుకుంటే మంచిందని చెప్పొచ్చు. జనసేన పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..భీమవరం లేదా కాకినాడ రూరల్‌లో గాని పవన్ పోటీ చేస్తారని, ఈ సారి మాత్రం ఒక సీటులోనే పోటీ చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news