BREAKING : ఆగస్టు 25న కేసీఆర్-జగన్ ల భేటీ..! ఎందుకో తెలుసా..?

-

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల సీఎంలతో ఆగస్టు 25న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి డీపీఆర్‌లు, బోర్డుల పరిధి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ఆగస్టు 5న జరగాల్సి ఉంది.

అదే రోజు తమకు అత్యంత ముఖ్యమైన సమావేశం, కేబినెట్ భేటీ ఉన్నందున ఆ రోజు కుదరదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం మరో తేదీని ఫిక్స్ చేసింది. 2016 ఆగస్టులో సీఎం కేసీఆర్‌, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్‌ కమిటీ సమావేశం జరగ్గా ఇది రెండోసారి.

Read more RELATED
Recommended to you

Latest news