డెవలప్మెంట్ ఫైల్స్ ఉండాలి కానీ.. కాశ్మీర్ ఫైల్స్ ఏంటి: సీఎం కేసీఆర్

-

దేశానికి బీజేపీ పాలన వల్ల 8 ఏళ్లలో ఏం జరగలేదని తేలనిపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. గంగా నదిలో శవాలు తేలేలా చేసిన ప్రభుత్వం అని విమర్శించారు. ఎంతసేపు కాశ్మీర్ ఫైల్స్… ఎంతసేపు సమాజాన్ని విభజించడం తప్పా ఏమీ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్ లో 149 దేశాల్లో ఇండియా 139 స్థానంలో ఉందని.. మన పక్కన ఉన్న భూటాన్, నేపాల్, పాకిస్థాన్ కన్నా తక్కువగా ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువ పరిరక్షణ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హంగర్ ఇండెక్స్ లలో కూడా చివరి స్థానాల్లో ఉన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. డెవలప్మెంట్ ఫైల్స్ ఉండాలి కానీ.. కాశ్మీర్ ఫైల్స్ ఏంటని ప్రశ్నించారు. బీజేపీ తీసుకువచ్చే దుర్మార్గపు విధానాలను, కాశ్మీర్ ఫైల్స్ విధానాలను తిప్పికొట్టాలని.. రాజకీయంగా ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. దేశంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని.. దేశంలో 15 లక్షల ఉద్యోగ ఖాళీలను నింపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news