తెలంగాణ రైతులకు కేసీఆర్ శుభవార్త.. రుణమాఫీ పై కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణమాఫీ ని పూర్తిగా చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 25వేలు, 50 వేలు ఉన్న రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. అతి త్వరలోనే లక్ష రూపాయలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

రుణమాఫీపై రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని భరోసా కల్పించారు సీఎం కేసీఆర్. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదని.. వాళ్లవి అన్ని తప్పుడు ప్రచారం అని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా యాసంగి కాలంలో… వరి పంట వేయకూడదని సూచనలు చేశారు. యాసంగి లో వారికి బదులు ఇతర పంటలు వేసుకుంటే లాభాలు బాగా వస్తాయని చెప్పారు. సీడ్ కంపెనీకి.. అనుబంధమై ఉన్న రైతులు వరి పంట పండించుకోవచ్చు అని తెలిపారు. కానీ తెలంగాణ బిజెపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు సీఎం కేసీఆర్.