ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజనులను, ఆదివాసీలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తూ.. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన హక్కులు ఇవ్వకుండా, పేదల ప్రజల ఉసురు పోసుకుంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో బంజారాహిల్స్‌లో దాదాపు రూ. 60 కోట్ల ఖర్చులతో కుమ్రం భీం ఆదివాసీ, సేవాలాల్ బంజారా భవన్‌లను ప్రారంభించుకున్నామన్నారు సీఎం కేసీఆర్.
సమస్త గిరిజన, ఆదివాసీ జాతికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా మంది గిరిజన ఉద్యోగులు, మేధావులు, కవులు, రచయితలు ఉన్నారు. గిరిజన సమస్యల గురించి మాట్లాడారు. అవి పరిష్కారం అయ్యేందుకు ఆదివాసీ, బంజారా భవన్‌లు వేదికలు కావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ చర్చల్లో అందరూ భాగస్వాములు కావాలని ఆదివాసీ, గిరిజన మేధావి వర్గాన్ని కోరుతున్నానన్నారు సీఎం కేసీఆర్. చాలా సమస్యలు ఉన్నాయి. వాలటన్నింటి పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలి. ఆ వేదికలను ఉపయోగించుకొని, మేధోమథనం చేయాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.