సీట్ల పంపకాలు..అప్పుడే పేచీ..!

-

తెలంగాణలో కమ్యూనిస్టులతో కలిసి కేసీఆర్ ముందుకెళ్లాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఒక్కప్పుడు కమ్యూనిస్టులకు కొన్ని నియోజకవర్గాల్లో బలం ఉండేది గాని..ఇప్పుడు ఆ బలం లేదు. కానీ ఉన్న నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులని కలుపుకుంటే తమకు అడ్వాంటేజ్ అవుతుందనే కోణంలో కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో మునుగోడు ఉపఎన్నికలో గెలవడం కోసం..సి‌పి‌ఐ,సి‌పి‌ఎం మద్ధతు అడిగారు.

ఇక తమకు సింగిల్ గా గెలిచే బలం లేక సి‌పి‌ఐ..టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు పలికింది. అటు సి‌పి‌ఎం సైతం టీఆర్ఎస్‌కు మద్ధతు ఇచ్చింది. ఈ పొత్తు వచ్చే ఎన్నికల వరకు కొనసాగాలని, అలాగే జాతీయ స్థాయిలో కూడా కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తానని కేసీఆర్ ప్రకటించారు. అయితే పొత్తు విషయంలో సి‌పి‌ఐ క్లారిటీ గానే ఉంది..వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని అనుకుంటుంది. కానీ సి‌పి‌ఎం మాత్రం మునుగోడు వరకే తమ పొత్తు అని తర్వాత పరిస్తితులని బట్టి మద్ధతు ఇస్తామని చెప్పింది. సరే ఏదైతే ఏముంది..టీఆర్ఎస్ తో సి‌పి‌ఐ పొత్తు కన్ఫామ్ అయింది.

ఇక ఇప్పటినుంచే సీట్ల విషయంలో కూడా రెండు పార్టీల మాధయ్ చర్చలు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలకు చెరో రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని టీఆర్ఎస్ వర్గాల నుంచి ప్రచారం నడుస్తోంది. ఎలాగో ఒక్క సీటులో కూడా గెలిచే బలం ఆ పార్టీలకు లేదు. అందుకే చెరో రెండో సీట్లు ఇచ్చి, గెలిపించుకుంటామని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

అదే సమయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాత్రం తమకు ‘డబుల్‌ డిజిట్‌’ సీట్లు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 25 సీట్లు అయిన కావాలని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో కమ్యూనిస్టులకు అన్నీ సీట్లు ఇచ్చే పరిస్తితి ఏ మాత్రం లేదు. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు…వారిని కాదని కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వడం కష్టం..మరి చివరికి కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news