తెలంగాణ రాష్ట్ర సమితి విస్తృతస్థాయి సమావేశం నేడు జరిగింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. అయితే.. ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తేలేదు.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగాయని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కు ఇంఛార్జి నియామిస్తమని అన్న కేసీఅర్ వెల్లడించారు.
మంత్రులు యాక్టివ్ గా ఉండండి…ఎందుకు ప్రభుత్వ స్కీమ్ ల గురించి విస్తృతంగా మాట్లాడడం లేదు అని మంత్రులను ప్రశ్నించారు కేసీఅర్. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు కేసీఆర్ సూచించారు.
నాతో కలిసి పోరాటానికి సిద్ధమా అని సమావేశంలో నేతలను అడిగిన కేసీఆర్.. పోరాటానికి తాము సిద్ధమే అని చేతులెత్తి సంఘీభావం తెలిపారు నేతలు. కేంద్రానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, మనకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి… తేల్చుకుందామని కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు కేసీఆర్ సూచించారు. అంతేకాకుండా.. సమావేశంలో ఆంధ్రా సీఎం జగన్ గురించి ప్రస్తావించిన కేసీఆర్.. కేంద్రానికి అనుకూలంగా జగన్ ఉన్న… అతన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేసింది అన్నారు. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా అని కేసీఆర్ అన్నారు. సమావేశం వివరాలు ఎక్కడ బయటకు చెప్పొద్దని నేతలకు కేసీఅర్ స్పష్టం చేశారు. మీ ఫోన్లపై నిఘా ఉంటుందని ఎమ్మె్ల్యేలతో అన్నారు కేసీఆర్.