సొంత వైరుద్యాలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవుతుంది : మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై

-

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం దాని స్వంత వైరుధ్యాల కారణంగా పతనమవుతుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మె మంగళవారం జోస్యం చెప్పారు. అధికార పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆయన, ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లో ఉందన్నారు. ఆ పరిణామాలు రాష్ట్రంలోని ప్రభుత్వంపై కూడా ఎన్నికల వేళ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ కి భారీగా ఓట్లు రాకపోతే తాను పదవీలో కొనసాగడం కష్టమేనని సీఎం అన్నారు. అలాగే, తాను ముఖ్యమంత్రి అవుతాననే కాంగ్రెస్ కి ప్రజలు ఓటు వేశారని, కానీ ఆ విషయంలో నిరాశ చెందానని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ పరిణామాలు గమనిస్తే.. సొంత పార్టీలో నెలకొన్న వైరుధ్యాల కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోనుంది. మోడీ మూడోసారి ప్రధాని అయిన కొన్ని నెలల్లో జాతీయ స్థాయిలో కీలక మార్పులు జరగనున్నాయి. కాంగ్రెస్ నిలువునా చీలినా ఆశ్చర్యంలేదు. దాని ప్రభావం కర్ణాటకపైనా ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కి చెందిన మంత్రులెవ్వరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వారి పిల్లలను పోటీలో ఉంచారు. ప్రభుత్వంలో పరిస్థితులు సానుకూలంగా లేవనేందుకు ఇది నిదర్శనమని’ బొమ్మె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version