దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేస్తున్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ కీలక నేతలు మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి నిరసనల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద బైఠాయించి… కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
గత 10 రోజుల్లో పెట్రోల్, డిజిల్ ధర 9 సార్లు పెరిగిందని.. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పెట్రోల్, డిజిల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోరాడుతుందని ఆపార్టీ నేతలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం ధరలను పెంచుతుందని మేం ముందే ఉహించామని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అన్నారు.