షుగర్ అదుపులో ఉండాలంటే.. డైలీ ఈ వాటర్ తాగితే సరి..!

-

బెండకాయ అంటే.. ఎప్పుడో ఓసారి కానీ.. వారం వారం తినడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడరు. కానీ ఇది అన్నీ కూరగాయలకంటే.. చాలా మంచి కాయకూర. ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటికే మనం బెండకాయన ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోవద్దు..ఏం లాభాలు ఉన్నాయో.. ఈ సైట్ లో అందించారు. ఈరోజ స్పెషల్గా.. బెండకాయను షుగర్ పేషంట్స్ ఎలా వాడితే.. షుగర్ కంట్రోల్లో ఉంటుందో చూద్దాం.

diabetes

శరీరంలో బ్లడ్ షుగర్ నిర్వహణకు బెండకాయ నీళ్లు చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బెండకాయలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఫైబర్, విటమిన్-బి6, ఫోలేట్ సమృద్ధిగా ఉంది. విటమిన్-బి డయాబెటిక్ న్యూరోపతి పురోగతిని నిరోధిస్తుంది.

బెండకాయలో కేలరీలు తక్కువగా ఉండడమే కాకుండా, సాలిబుల్ , అన్ సాలిబుల్ ఫైబర్‌కి ఇది చాలా మంచి మూలంగా పనిచేస్తుంది. దీని కారణంగా, ఫైబర్ శరీరంలో ఆలస్యంగా విచ్ఛిన్నమవుతుంది. అలాగే రక్తంలో చక్కెర చాలా నెమ్మదిగా విడుదల అవుతుంది. ఓక్రా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇదే కారణం.

ఓక్రా గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి తీసుకోవడం చాలా ముఖ్యం. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్’ కూడా డయాబెటిక్ రోగులకు లేడీఫింగర్ చాలా మంచి ఎంపిక అని నిరూపించారు.

బెండకాయ నీటిని ఎలా తయారు చేయాలి..?

బెండకాయ వాటర్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని కోసం, మొదట 5-6 బెండకాయలను తీసుకొని వాటిని క్లీన్ చేయండి.. దీని తరువాత, కత్తి సహాయంతో రెండు పొడవాటి భాగాలుగా కత్తిరించండి. కట్ చేసిన ముక్కలను ఒక పాత్రలో నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టండి. ఇలా నానపెట్టిన బెండకాయ వాటర్ ను మరసటి రోజు ఉదయం తాగండి.

అయితే ఈ పద్దతి వల్ల.. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ టాబ్లెట్స్ వాడుతూ..ఈ చిట్కా పాటించాలనుకుంటే.. ఓ సారి వైద్యులను సంప్రదించాలి. ఎందుకుంటే.. రెండూ చేయడం వల్ల షుగర్ లెవల్స్ డౌన్ అయిపోయి.. అది మళ్లీ ప్రమాదకరంగా మారుతుంది.. సాధారణంగా.. టాబ్లెట్స్ వాడేవాళ్లు.. నాచురల్ పద్దతిని అవలంబించే ముందే కాస్త జాగ్రత్తగా ఉండాలి.. కొద్దికొద్దిగా డోస్ పెంచుచూ.. టాబ్లెట్స్ తగ్గిస్తూ.. ఒక క్రమపద్దతిలో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news