IND VS SL : క్లీన్ స్వీప్ పై టీమిండియా గురి… ఈరోజు ఇండియా శ్రీలంకల మధ్య మూడో టీ20..

-

వరస విజయాలతో దూకుడు మీదుంది టీం ఇండియా. వరసగా రెండు సిరీస్ లను  కైవసం చేసుకుంది. ఇప్పటికే సొంతగడ్డపై జరిగి వెస్టిండీస్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా శ్రీలంతో జరుగుతున్న మూడు టీ20 సిరీస్ లో భాగంగా వరసగా రెండు టీ20లను గెలిచి.. సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా మరో క్లీన్ స్వీప్ పై గురిపెట్టింది. ఈరోజు ధర్మశాల వేదికగా… శ్రీలంకతో మూడో టీ20 జరుగనుంది. ఇప్పటికే రెండు టీ20 లను గెలుచుకున్న టీం ఇండియా మూడో టీ20ని కూడా గెలుచుకునేందుకు సన్నద్ధం అవుతోంది. 

దీనికి తోడు టీమిండియా బ్యాటర్లు సూపర్ ఫాంలో ఉన్నారు. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజాలు సూపర్ ఫాంలో ఉన్నారు. రెండో టీ20లో శ్రీలంక నిర్థేశించిన భారీ స్కోర్ ను కూడా టీమిండియా బ్యాటర్లు అలవోకగా చేధించారు. ఇటు బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో కూడా శ్రీలంక కన్నా.. ఇండియా మెరుగైన స్థితిలో ఉంది. ఇదిలా ఉంటే తలకు గాయమై ఇషాన్ కిషన్ మూడో టీ 20కి అందుబాటులో ఉండటం అనుమానంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version