రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా తనను తాను చెప్పుకొనే చంద్రబాబు.. ఇటీవల కాలంలో వైసీపీ ప్ర భుత్వం వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేయలేక పోతున్నారు. రాజకీయంగా ఎదురవుతున్న వ్యూహాలకు ఆయన ప్రతి వ్యూహాలు వేయలేక పోతున్నారు. అదేసమయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో కక్కలేక, మింగలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనే వాదన కూడా చంద్రబాబు విషయంలో బాహాటంగానే వినిపిస్తుండడం గమనార్హం. గడిచిన నెల రోజుల్లో జగన్ వేసిన అడుగులు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేవిగా మారాయి. అయితే, వీటిని ఆయన నిలువరించే అవకాశం లేక పోవడం, అలాగని చూస్తూ.. ఉంటే.. తనకే ఎసరు వస్తుందని తెలిసి మధన పడుతుండడం గమనార్హం.
ఒకటి.. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన సొంత నియోజకవర్గం.. దాదాపు మూడు దశాబ్దులుగా ఆయనను గెలిపిస్తున్న నియోజకవర్గం కుప్పంపై జగన్ తనదైన శైలిలో పంచ్ విసిరారు. జిల్లాలో పేదల కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం ఈక్రమంలోనే కుప్పం నియోజకవర్గంలోని ప్ర భుత్వ స్థలాల్లో వారికి ఇళ్లు కేటాయించేందుకు పెద్ద ఎత్తున నిర్ణయించుకుంది. అంటే.. ఇప్పటి వరకు కుప్పంలో చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకుపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపిస్తుం ది. ఓటు బ్యాంకు పెరుగుతుంది. అయితే, ఈ పెరిగిన ఓటు బ్యాంకు మొత్తంగా వైసీపీకి అనుకూలంగా ఉండేలా జగన్ చక్రం తిప్పారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది ఎన్నికల్లోనే తన నియోజకవర్గంలో తనకు వచ్చిన మెజారిటీ భారీగా తగ్గుము ఖం పట్టడంపై చంద్రబాబు ఇప్పటికేవేదన చెందుతున్నారు. ఇక, ఇప్పుడు జగన్ వేసిన అడుగులతో ఆయన ఈ విషయాన్ని వద్దని చెప్పలేరు. అలా అంటే.. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారనే వ్యతిరేక ప్రచారం వైసీపీ చేస్తుంది. అలాగని ఊరుకుంటే.. ఓటు బ్యాంకుకే మోసం వస్తుంది. దీంతో ఈ విషయంలో ఆయన తర్జన భర్జన పడుతున్నారు. ఇక, ఇప్పుడు విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు. ఇది పూర్తిగా కోస్తా జిల్లాల దళిత ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుంది. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు ఏమీ మాట్లాడలేక తర్జన భర్జన పడుతున్నారు. మొత్తంగా జగన్ వ్యూహానికి చంద్రబాబు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారు.