టాలీవుడ్ నిర్మాతకు సీఎం జగన్ కీలక పదవి..

-

ఏపీ సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్‌ కుమార్‌ ను నియమిస్తూ ఏపీ సర్కార్‌ గురువారం ఉత్తర్వలను జారీ చేసింది. ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎం. హరి జవహర్‌ లాల్‌ జీవో జారీ చేశారు.

టీటీడీ బోర్డుకు ఇప్పుడు టాలీవుడ్‌ పరిశ్రమకు నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. దాసరి కిరణ్‌ కుమార్‌ తెలుగు సినిమా రంగానికి చెందిన వారు. నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా దాసరి కిరణ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌, టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version