కరోనాపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశం…. ఎల్లో అలెర్ట్ జారీ..!

-

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తం అయింది. ఈ రోజు సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతను ఉన్నతస్థాయి  సమీక్ష నిర్వహించనున్నారు. గత ఆరు నెలల కాలం తరువాత.. సోమవారం ఢిల్లీలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే..331 కరోనా కేసులు నమోదుకావడం ఢిల్లీ వాసులను కలవరానికి గురిచేస్తోంది.

ఆరు నెలల కాలంలో ఢిల్లీలో ఒకే రోజు అధిక కేసులు నమోదుకావడంతో , గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(GRAP) కింద ఎల్లో అలెర్ట్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం మించిపోయింది.

మరో వైపు ఢిల్లీలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే కేసుల సంఖ్య 160కి పైగా నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. నేడు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది సర్కార్. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ప్యూని విధించింది. అయితే ప్రస్తుతం ఎల్లో అలెర్ట్ కింద.. పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు మరియు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను మూసివేయవచ్చని తెలుస్తోంది. దీంతో పాటు సరి బేసి విధానం ద్వారా దుఖాణాలు, షాపింగ్ మాల్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించనున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version