ఆపరేషన్ గంగ పేరిట బీజేపీ చేపడుతున్నదంతా ఓట్ల వేట కోసమేనని ఓ వాదన వినిపిస్తోంది.అందుకే బీజేపీ తో విభేదించే పార్టీలు అన్నీ ఏక అవుతున్నాయి. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో పెద్ద రాజకీయమే జరుగుతుందన్న వాదన ఒకటి బలీయంగా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వాదాలు వినిపిస్తు న్నాయి.వచ్చే ఎన్నికల్లో కూడా ఆపరేషన్ గంగ ప్రభావం స్పష్టంగా ఉంటుందని అంటున్నారు ఇంకొందరు.ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం ఇది.
యూపీలో ఈ రోజుతో అంటే మార్చి ఏడుతో ఎన్నికల తుది విడత ప్రక్రియ ముగియనుంది. అటుపై ఎన్నికలకు సంబంధించి పోలయిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనే రెండు పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. యూపీతో పాటు పంజాబ్ ఫలితాలు కూడా కీలకమే అయినప్పటికీ దేశం దృష్టి పంజాబ్ పై కన్నా యూపీపైనే ఎక్కువగా ఉంది. పంజాబ్ లో కాంగ్రెస్ తగాదాలు వాటి ఫలితాలు బీజేపీకి అనుకూలిస్తే అక్కడ కూడా మోడీ పరివారం కొలువు దీరడం ఖాయం. ఇక యూపీలో మోడీ,షా, యోగీ ఈ త్రయం ఏ విధంగా పనిచేసింది..అన్నది ఓ పెద్ద రహస్యంగా ఉంది.
ఎందుకంటే ఎన్నికల వరకూ పెద్దగా తాయిలాలు ఏవీ లేవు. ఆ మాటకు వస్తే మ్యానిఫెస్టో కూడా పెద్దగా లేదు. ఉచిత విద్యుత్ (వ్యవసాయరంగానికి సంబంధించి) ఇవ్వాలనుకుంటున్నామని చెప్పారు. రుణమాఫీకి సంబంధించి ప్రధాన పార్టీలు అన్నీ ఇప్పుడు కాకున్నా రేపటి వేళ అయినా ఏదో ఒకటి చెప్పాలి. అంతేకాదు ఇక్కడ రైతులకు భరోసా ఇచ్చే విధంగా నల్ల చట్టాల రద్దు ఒకటి కూడా బీజేపీకి అనుకూలం అయినా కూడా ఫలితంపై ఆశలు అంత వేగంగా తేలవు. అందుకే సమాజ్ వాదీ పార్టీ కూడా హిందుత్వ సిద్ధాంతంతోనే రాజకీయం చేసింది.పనిలో పనిగా బీజేపీ ఆపరేషన్ గంగను తనకు అనుకూలంగా మలుచుకుని ఉంటే యుద్ధ ప్రభావం ఓటరుపై ఏ విధంగా ఉంది అన్నది ఓ పెద్ద సందిగ్ధం.