దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను తెరకెక్కించి ఎన్నో అవార్డులను కూడా దక్కించుకున్నారు. డైరెక్టర్ ఎవరైనా సరే సినిమాను తీసి ఊరుకుంటారు కానీ ప్రమోషన్లలో రాజమౌళి కూడా పాల్గొంటూ చాలా డిఫరెంట్ గా సాధారణ ప్రేక్షకుడిగా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటారు. అయితే రాజమౌళి అంటే కొన్ని సంవత్సరాల క్రితం కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదల అయ్యిందో రాజమౌళి సత్తా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకు తెలిసిపోయింది.
ఇతర దేశాలలో కూడా రాజమౌళి సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. బాహుబలి రెండవ పార్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ఒక్కసారిగా పెంచేశాడు. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో RRR సినిమాని మల్టీస్టారర్ రేంజ్ లో తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని అదుర్స్ అనిపించేలా చేశారు. దాదాపుగా ఈ చిత్రం రూ.1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ వసూల్ చేసింది. దీంతో రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
ఈ సినిమా చూసిన వారందరూ కూడా ఆస్కార్ గెలుస్తుందని అందరూ అభిప్రాయపడ్డారు.. కానీ మన దేశం నుంచి అధికారికంగా ఎంట్రీ మాత్రం దక్కలేదు.అయితే తన సినిమాని నేరుగా ఆస్కార్ బరిలో నిలపడానికి రాజమౌళి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అందుకోసం ఈ మధ్య జపాన్, అమెరికా, న్యూయార్, వంటి ఇతర దేశాలలో ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. ఇప్పటికే న్యూయార్క్ క్రిటిక్స్ అవార్డు, సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది ఈ చిత్రము. ఇక ఆస్కార్లో కొన్ని చిత్రాలు మాత్రమే ఓటింగ్ పద్ధతుల సెలెక్ట్ చేస్తారు వీటిని అకాడమీ లోని 10 ప్రొఫెషనల్ గా వేస్తారు వీళ్ళ కోసం రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాని స్పెషల్ షో ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపుగా 80 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లు సమాచారం. రాజమౌళి తీసిన సినిమా అవుట్ పుట్ బాగుందని అందరూ మెచ్చుకున్నారట. ఒకవేళ ఆస్కార్ గనుక సొంతమైతే రాజమౌళి రేంజ్ మారిపోతుందని అలాగే టాలీవుడ్ స్థాయి కూడా మారిపోతుందని చెప్పవచ్చు.