ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కటానికి నగ్మా తండ్రి 13 ఏళ్లకే ఆమెకు హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చారనే సంగతి తెలుసా.. !

-

టాలీవుడ్ తో పాటు ఇతర సినీ పరిశ్రమల్లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగింది నగ్మా. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి అగ్రహీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అటు సినిమాల పరంగా.. ఇటు రాజకీయాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నగ్మా.. వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నడిచింది.. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయిన తన కుటుంబ పరిస్థితులను చక్కదిద్దడానికి 13 ఏళ్లకే హీరోయిన్ గా మారింది అనే సంగతి ఎవరికీ తెలియదు..

తన అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన నటి నగ్మా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈ తార వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. నగ్మా కడుపులో ఉంటుండగానే వాళ్ళ అమ్మానాన్న విడిపోయారు.. ఈమె పుట్టిన ఏడాదికే నగ్మా తల్లి షమా కాజీ.. సినీ నిర్మాత అయిన చందన్ సదనాహ్ ను పెళ్లి చేసుకుంది.. అయితే నగ్మా కు 12 ఏళ్లు వచ్చేటప్పటికి వీరి కుటుంబం అధికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో ఆమెను హీరోయిన్ చేయాలనే ఆలోచన చందన్ సదనాహ్ కు వచ్చింది అయితే ఈ సమయంలో ఎందరో దర్శక నిర్మాతలకు అభిమానం చూపించినప్పటికీ ఇంత చిన్న వయసులో హీరోయిన్ గా ఎలా నటిస్తుంది అమ్మాయి చాలా చిన్నగా కనిపిస్తుంది కొన్నాళ్లు వేచి చూడండి అనే వారంట అయితే ఎలా అయినా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కటానికి 13 ఏళ్ల వయసు ఉన్న నగ్మాకు వారి తల్లిదండ్రి హార్మోన్ ఇంజక్షన్స్ ఇప్పించారట.. ఆ తర్వాత నగ్మాకు బాగీ: ఎ రెబల్ ఆఫ్ లవ్ సినిమాలో అవకాశం వచ్చింది.. తర్వాత వలస అవకాశాలను అందిపుచ్చుకుంటూ తెలుగు తమిళ హిందీ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించింది.. అలాగే వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొని చివరికి పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది నగ్మా..

Read more RELATED
Recommended to you

Exit mobile version