ఆలయాలకు వెళ్ళినప్పుడు గట్టిగ అరవడం, ఎవరినైనా దూషించడం వంటివి చెయ్యకూడదు. అలానే దేవుడికి నైవేద్యం పెట్టని ఆహారం తీసుకోకూడదు. దేవాలయం లో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. అలానే గుడి లో ఎక్కడ పడితే అక్కడ చెత్త కూడా వెయ్యకూడదు. ఇది ఇలా ఉంటె మీరు దీపారాధన చేసినప్పుడు శివునికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడి వైపు చేయాలి. అలానే అమ్మ వారికి నూనె దీపమైతే ఎడమ వైపు, ఆవు నేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి. ఇది గుర్తుంచుకోండి.
ఇది ఇలా ఉంటె గుడి లో ప్రదక్షిణలకి కూడా ఒక పద్ధతి ఉంది. అదేమిటంటే..? హనుమంతుడికి ఐదు, ఏదైనా కోర్కె వుంటే 11, 27, 54, 108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితం వుంటుంది. అదే మీరు నవ గ్రహాలకు అయితే 3 సార్లు లేదా తొమ్మిది సార్లు చేయవచ్చు. లేదా బేసి సంఖ్య లో 11, 21, 27 సార్లు చేయవచ్చు. ధ్వజస్థంభం నుంచి మళ్లీ ధ్వజస్థంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. మందిరమైతే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్లీ మందిర ముఖ ద్వారం వరకు ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్లు.