గడ్డకట్టిన ఆహార పదార్థాలను తింటున్నారా..? అయితే మీరు ఆ ప్రమాదంలో ఉన్నట్లే..

-

జీ లైఫ్ లో అన్ని ఫాస్ట్ గా అయిపోయే వాటికి మనం ప్రాధాన్యం ఇస్తున్నాం. అది పని అయినా..వంట అయినా..మనకు వచ్చే అనేక ఆరోగ్యసమస్యలకు మొదటి కారణం..సరైన ఆహారం తీసుకోకపోవడమే..ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే గృహిణులు..మిగిలిన వాటిని అన్నింటిని..ఫ్రిజ్ లో వేసి వేసి..వాటిని ఒక దశలో మర్చిపోతారు కూడా. అయినా అవి పారేయరు. చాలామంది..ఫ్రిజ్ లో పెట్టినవి ఎన్ని రోజులైనా తినేస్తుంటారు. అలా గడ్డకట్టిన ఆహారం తినటం వారికి అలవాటైపోయింది. నిల్వ ఉంచినవి, ఫ్రిజ్ లో గడ్డకట్టినవి తినటం వల్ల అనారోగ్యం భారిన పడక తప్పదని అధ్యయనాల్లో తేలింది.

వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరం. ఎక్కువమంది అనుకుంటారు..ఫ్రిజ్ లో పెట్టాం కదా..చెడు వాసన ఏం రావడం లేదు కదా..తింటే ఏమైతుంది..ఎందుకు చూస్తూ చూస్తూ తినేవాటిని పారేయటం అని..పాపం చదువుకున్న పిల్లలు వాళ్ల ఇంట్లో పెద్దోళ్లకి చెప్తారు.. కానీ వీళ్లు వినరే..ఆ ఫ్రిజ్ లో పెట్టినవే లాగిస్తూ ఉంటారు. అసలు కొందరి ఇళ్లల్లో ఫ్రిజ్ లో చిన్నసైజ్ కర్రీపాయింట్ ఉంటుంది..నిన్నటివి, మొన్నటివి, పోయినవారానివి ఇలా మిగిలిన అన్నింటిని ఆ ఫ్రిజ్ లో కుక్కేస్తారు. దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

గుండె వ్యాధులు

గడ్డకట్టిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాలలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తుంది.. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా బాగా పెరుగుతుంది. ఫలితంగా..గుండె జబ్బులకు దారి తీస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం

గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. రిపోర్టుల ప్రకారం.. ఫ్రోజెన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్, లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65 శాతానికి పైగా ఉందని తేలింది..అంతే కాదు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కూడా ఇదే కారణమవుతుంది. ఫ్రోజెన్ ఫుడ్స్ తీసుకోవడం మానేయాలంటున్నారు నిపుణులు.

బరువు పెరుగడం

సాధారణ ఆహారంతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో రెండు రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్లు కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం క్రమంగా పెరుగుతుంది. దీని కారణంగా బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి. మీరు ఇది వెంటనే అనుభవించరు..ఇలానే ఫ్రిజ్ లో పెట్టిన గడ్డకట్టిన, నిల్వ ఉన్న పదార్థాలు తింటూ తింటూ ఉంటే..మీ బరువు కూడా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. ఒకే రోజులు మీకు తెలియదు..కానీ ఒక రోజు మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు.

మధుమేహం

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆహారం జీర్ణం కాకముందే గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతే కాదు దీని వల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. చాలామంది అనుకుంటారు..జీన్స్ లో మధుమేహం లేదుకదా..మనకెందుకు వచ్చిందా అని..దానికి కారణం..ఇది కూడా కావచ్చు. అధిక బరువు ఉన్నావారకి..మధుమేహం కూడా వచ్చే అవకాశం దాదాపు ఉంది. ఘగర్ కంట్రోల్ లో ఉండాలంటే..వెయిట్ బ్యాలెన్స్ లో ఉండాలి. అలా ఉండాలంటే..త్వరగా అరిగిపోయే పదార్ధాలే తినాలి..ఫ్రిజ్ లో పెట్టినవి అరగడానికి చాలా టైం పడుతుంది..అందులో కార్పోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల అది మీ ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేస్తుంది. కడు నింపుకోవడం చాలా తేలిక..కానీ..పోషకవిలువలతో కూడిన వాటితో నింపుకోవడం పాయింట్.

ఇప్పటికైనా..గడ్డకట్టిన, నిల్వ ఉంచిన ఆహారాన్ని తినడం మానేయండి. వేస్ట్ అయిపోతుందని తిని..మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. సాధారణంగా..భారతీయులు వండే విధానం..ఎలా ఉంటుదంటే..ఒక ముద్దు ఎక్కువైనా పర్వాలేదు..ఎక్కువగా వండాలి అనుకుంటారు. అదే పాశ్యాత్త దేశాల్లో వారు..ఒక ముద్దు తక్కువైనా పర్వాలేదు..కరెక్టుగా వండాలి అనుకుంటారట. మన ఈ దోరణి వల్లే..ఆహారం ఎక్కువగా మిగిలిపోయి..అది కాస్త నిల్వ ఉంచుకుని తినాల్సి వస్తుంది. వడ్డేప్పుడే..జాగ్రత్తగా కొలతల ప్రకారం వండండి. ఒకవేళ అది మిగిలినా..ఆరోజు రాత్రి వరకే..మరుసటి రోజు తిందాం అనే పద్దతిని వీలైనంత త్వరగా మానేయడం మనకు మన ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news