ఈగలు కాళ్లను ఎందుకు రుద్దుకుంటాయో తెలుసా..? వాళ్ల ఫ్రెండ్స్‌కు సిగ్నల్‌ ఇవ్వడానికా..!!

-

ఇళ్లల్లో ఈగలు, దోమలు ఉండటం కామన్‌. మనం ఎంత శుభ్రంగా ఉంచినా.. ఈగలు అయితే వస్తూనే ఉంటాయి.. దోమలు అయితే కుడతాయి కాబట్టి వీటిని ఎలాగోలా వదిలించుకుంటాం.. ఈగలు తక్కువగా ఉంటే..మనం పెద్దగా పట్టించుకోం. తరచూ మన ఆహార పదార్థాలపై వాలే ఈగలకు సంబంధించిన ఈ విషయాలు తెలిస్తే.. ఆశ్చర్యం కలగకమానదు.

ఇగలు.. తమ ముందు, వెనక కాళ్లను ఎప్పుడూ రుద్దుకుంటూ ఉంటాయి. ఈగలు కాళ్లను రుద్దేసుకుంటూ కనిపిస్తాయి. అది చూసి మనం అవి ఊరికే టైం పాస్‌కు చేసుకుంటాయి అనుకుంటాం.. అసలు విషయం అది కాదు. ఆ రుద్దుడు వెనక పెద్ద కథే ఉంది భయ్యో..!!

 

 

రకరకాల కారణాల కోసం ఈగలు ఇలా రుద్దుకుంటాయి. మొదటి కారణం శుభ్రత. ఈగలు.. ఎక్కడెక్కడో వాలతాయి. రకరకాల ఆహార పదార్థాలపై దిగుతాయి. అవి తిరిగే ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కాళ్లకు అంటుకుంటుంది. దాన్ని వదిలించుకోవడానికి ఈగలు.. కాళ్లను రుద్దుకుంటాయి. మనం కూడా కాళ్లకు ఏదైనా అంటుకుంటే అలాగే చేస్తాం కదా.. ఈగలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. తద్వారా కాళ్లకు అంటుకున్న మురికి, చెత్త, బ్యాక్టీరియా తొలగిపోతుంది.

లొకేషన్‌ షేరింగ్‌ కోసం..

ఈగలు తమ సమాచారాన్ని ఒక దాని నుంచి మరొక దానికి పంపేందుకు కూడా కాళ్లను రుద్దుకుంటాయి. ఈగల కాళ్లకు చిన్న వెంట్రుకలు ఉంటాయి. అవి సెన్సిటివ్‌గా ఉంటాయట.. ఆ వెంట్రుకల్ని ముట్టుకుంటే.. వైబ్రేషన్స్ వస్తాయి. ఈగలు తమ కాళ్లను రుద్దుకున్నప్పుడు తరంగాల రూపంలో వైబ్రేషన్స్.. గాలిలోకి వెళ్తాయి. ఈ వైబ్రేషన్స్‌ని మనం గుర్తించలేం గానీ.. ఇతర ఈగలకు తెలుస్తుంది. వైబ్రేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటికి తెలుస్తుంది. తద్వారా ఫలానా ప్రదేశంలో ఈగ ఉంది అనే విషయం మిగతా ఈగలకు తెలుస్తుంది. ఈగలకు కూడా అక్కలు, చెల్లెల్లు, లవర్స్ ఉంటాయి.. వాటి జాడను తెలిసుకునేందుకు ఇలా చేస్తాయట..!!

ఏదైనా ఈగ ఓ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఆహారాన్ని చూస్తే… ఆ విషయాన్ని మిగతా ఈగలకు చెప్పడానికి తమ కాళ్లను రుద్దుతాయి. తద్వారా మిగతా ఈగలకు సంకేతం వెళ్తుంది. వైబ్రేషన్స్ వస్తున్నాయంటే… అక్కడేదో ఆహారం ఉందన్న మాట. మనం కూడా అక్కడికి వెళ్దాం అని.. మిగతా ఈగలు గుంపు కూడా ఆహారం దగ్గరకు వెళ్తాయి.

ఈగలు కాళ్ల ద్వారా రుచి చూడగలవట.. వాటి కాళ్లకు కీమోరెసెప్టర్స్ ఉంటాయి. అవి రకరకాల రసాయనాలకు స్పందిస్తాయి. కాళ్లను రుద్దడం ద్వారా ఈగలు.. తాము వాలిన ప్రదేశంలో ఉన్న కెమికల్స్‌ని శాంపిల్ టేస్ట్ చూస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version